Hyderabad, Jan 6: రానున్న కాలంలో మనిషి 300 ఏళ్లు బతికే రోజులు రాబోతున్నాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ (ISRO Chairman S Somanath) చెప్పారు. మనిషి శరీరంలోని పాడైన అవయవాలు (Limbs), చనిపోయే దశలో ఉన్న జీవకణాలను (Cells) మార్చడం ద్వారా మనిషి 200 నుంచి 300 ఏళ్ల వరకు జీవించే అవకాశముంటుందని ఆయన వివరించారు. విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు, భవిష్యత్తులో వచ్చే ఆవిష్కరణల ద్వారా ఇది సాధ్యమయ్యే అవకాశముందన్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ 12వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇస్రో చైర్మన్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇస్రో చైర్మన్ సోమనాథ్‌కు JNTU డాక్టరేట్ pic.twitter.com/y4kAhcT9HT
— V6 News (@V6News) January 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)