Newyork, Jan 29: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) (NASA) చంద్రుడిపై (Moon) వ్యోమగాములను పంపేందుకు ఇప్పటికే పలు మిషన్లను సిద్ధం చేసింది. అయితే, ప్లానెటరీ సైన్స్ జర్నల్ లో తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం నాసాకు సవాల్ గా మారింది. చంద్రుడు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాడని (Moon is Shrinking), దక్షిణ ధ్రువంపై ప్రకంపనాల వల్ల ఉపరితలం పూర్తిగా గుంతలమయంగా తయారైందని పరిశోధకులు తేల్చారు. ఆర్టెమిస్ ను నాసా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దించాలని ప్రణాళిక రచించిందని, అయితే చంద్రుడిపై ప్రకంపనల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయని, ఇక్కడ చాలా భాగం సేఫ్ ల్యాండింగ్ కు అనుకూలంగా లేదని అధ్యయనంలో తేలింది. చంద్రుడిపై జరుగుతున్న ఈ పరిణామాలు భవిష్యత్తులో వ్యోమగాములకు సమస్యలు తెచ్చిపెడతాయని హెచ్చరించింది.
The moon is shrinking—and it could affect future NASA missions https://t.co/9G3r33DYoe pic.twitter.com/TTn9Tdh23G
— Newsweek (@Newsweek) January 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)