భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం చేపట్టనుంది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 30న ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌కి చెందిన డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లను నింగిలోకి పంపనున్నట్టు ఇస్రో సోమవారం వెల్లడించింది.

సింగపూర్‌ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల అవసరాల నిమిత్తం డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ను ప్రయోగిస్తున్నారు.డీఎస్ ఎస్‌ఏఆర్‌తోపాటు టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ మైక్రో శాటిలైట్‌ వెలాక్స్‌-ఏఎం, ఎక్స్‌పరిమెంటల్‌ శాటిలైట్‌ ‘ఆర్కేడ్‌’, 3యూ నానోశాటిలైట్‌ ‘స్కూబ్‌-2’, ఐవోటీ కనెక్టివిటీ నానోశాటిలైట్‌ ‘నూలయన్‌’, గలాసియా-2, ఓఆర్‌బీ-12 స్ట్రైడర్‌ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపనున్నారు.

Here's ISRO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)