చంద్ర‌యాన్‌-3(Chandrayaan-3) స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈనెల 13వ తేదీన ఇస్రో ప్ర‌యోగించ‌నున్న విష‌యం తెలిసిందే.అందులో భాగంగా ఈ రోజు చంద్ర‌యాన్ పేలోడ్‌ ఉన్న క్యాప్సూల్‌ను .. జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఇవాళ అనుసంధానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇవాళ ఇస్రో త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేసింది. శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ సెంట‌ర్ నుంచి ఆ రాకెట్‌ను ప్ర‌యోగించ‌నున్నారు.

చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ సుమారు 3900 కేజీల బ‌రువు ఉంటుంది. తొలుత యూఆర్ రావు శాటిలైట్ సెంట‌ర్‌లో పేలోడ్‌ను క్యాప్సూల్ చేశారు. ఆ త‌ర్వాత దాన్ని ప్ర‌త్యేక వాహ‌నంలో స‌తీశ్ ధావ‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. అక్క‌డ రాకెట్‌తో పేలోడ్‌ను అనుసంధానం చేశారు. రాకెట్ పైభాగంలో ఉన్న పేలోడ్‌లో ల్యాండ‌ర్‌, రోవ‌ర్ ఉంటాయి. దాంట్లో ఉన్న ప్రొప‌ల్స‌న్ మాడ్యూల్ వ‌ల్ల చంద్రుడికి సుమారు 100 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు స్పేస్‌క్రాఫ్ట్ వెళ్తుంది. నిర్దేశిత ప్ర‌దేశంలో ల్యాండ‌ర్ సుర‌క్షితంగా దిగుతుంద‌ని, ఆ త‌ర్వాత రోవ‌ర్ అక్క‌డ ర‌సాయ‌న‌క విశ్లేష‌ణ చేప‌డుతుంద‌ని ఇస్రో అధికారులు తెలిపారు.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)