ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (Meta) కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో తీసుకొచ్చిన టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదరులకు అందుబాటులోకి వచ్చింది.

ఈ యాప్ ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఇందులో ఖాతాలు తెరవగా.. తొలి నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు పెరిగింది. ఈ విషయాన్ని మెటా సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు. మెటా తీసుకొచ్చిన ఈ కొత్త ‘థ్రెడ్స్’ యాప్ ను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను వినియోగించి లాగిన్‌ చేసుకోవచ్చు. ఇందులో సుమారు వర్డ్స్‌తో లింక్స్‌, ఫొటోలు, ఐదు నిమిషాల నిడివిగల వీడియోలను సైతం పోస్ట్‌ చేసుకోవచ్చు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)