వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ తాజాగా లేఆప్స్ ప్రకటించింది. లాస్ఏంజెల్స్‌, న్యూయార్క్‌, అస్టిన్ స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు లొకేష‌న్స్‌లో ప‌నిచేస్తున్న దాదాపు 60 మంది ఉద్యోగుల‌పై టిక్‌టాక్ వేటు వేసింది. ఆర్ధిక మంద‌గ‌మ‌నం నేప‌ధ్యంలో వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా టిక్‌టాక్ లేఆఫ్స్‌కు మొగ్గుచూపింద‌ని ఎన్‌పీఆర్ రిపోర్ట్ పేర్కొంది.7000 మంది ఉద్యోగుల‌తో అమెరికాలో టాప్ యాప్స్‌లో టిక్‌టాక్ ఒక‌టిగా నిల‌వ‌గా ప్ర‌మోటింగ్ కంపెనీ చైనీస్ టెక్ దిగ్గ‌జం బైట్‌డ్యాన్స్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1,50,000 మందికిపైగా ప‌నిచేస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)