సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు కలిగి ఉన్న వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్స్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. ఫార్వర్డ్ మెసేజ్‌లకు అడ్డుకట్ట వేసే పనిలో భాగంగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ను టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి తెస్తోన్న ఫీచర్‌తో వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ మెసేజ్‌లకు చెక్ పెట్టనుంది. ఈ ఫీచర్‌తో ఒక మెసేజ్‌ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు ఫార్వార్డ్ చేయకుండా చేస్తోంది.
దీంతో స్పామ్ మెసేజ్‌లకు వాట్సాప్ అడ్డుకట్ట వేయనున్నది. ఒకవేళ సదరు మెసేజ్‌ను ఒకరికంటే ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయాలంటే ఆయా మెసేజ్‌ను కాపీ చేసి రెసిపెంట్ కాంటాక్ట్ చాట్‌కు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన వాట్సాప్‌ల్లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ విజయవంతమైతే అందరికీ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ ట్రాకర్ బెటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది.
WhatsApp to limit forwarded messages to contain spam. Details - Mint https://t.co/7ciDxlbDIx #bhavikbhavsar #tech
— bhavik bhavsar (@bhavik_bhavsar) April 4, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
