Newdelhi, Feb 10: ఆర్థిక మాంద్య భయాలతో టెక్ కంపెనీలు ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టాయి. ఒక్క జనవరి నెలలోనే 50 వేల మందికి పైగానే ఉద్యోగులను టెక్ కంపెనీలు ఉద్యోగం నుండి తీసివేశాయి. వీటిలో అమెజాన్, గూగుల్, డెల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి టాప్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి యాహూ కూడా చేరింది. వచ్చే ఏడాది వ్యవధిలో తమ మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం లేదా 1700 మందిని ఇంటికి సాగనంపనున్నట్టు వెల్లడించింది.
సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది. సంస్థ ప్రకటనల విభాగంలో అత్యధికంగా 50 శాతం మంది ప్రభావితం కానున్నారని చెప్పింది. అంతేకాకుండా.. ఈ వారం సుమారు వెయ్యి మందిని తొలగించొచ్చని పేర్కొంది.
Yahoo plans to cut about 20% of its workforce, or just over 1,700 jobs, over the next year, as the technology industry continues to shed employees ahead of a potential economic slump. https://t.co/rdLu4TBBiW
— CBS News (@CBSNews) February 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)