యూ ట్యూబ్‌ వినియోగదారులకు శుభవార్త. షార్ట్-ఫారమ్ వీడియో క్రియేటర్లు ఇక నుంచి వీడియోల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ తన వీడియో ఫీచర్ షార్ట్‌లపై ప్రకటనలను పరిచయం చేస్తోందని తద్వారా, ఆదాయంలో 45 శాతం ఆదాయాన్ని క్రియేటర్లకు ఇస్తామని మంగళవారం ప్రకటించింది.కాగా ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో యూట్యూబ్‌ ప్రకటనల ద్వారా 14.2 బిలియన్‌ డాలర్లను ఆర్జించింది. ఇది 2021లో ఇదే కాలంతో పోలిస్తే 9 శాతం పెరిగింది. టిక్‌టాక్‌ (మన దేశంలో బ్యాన్‌) తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తాజా అప్‌డేట్‌ను తీసు కొచ్చింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)