NCPCR summons YouTube India over vulgar videos: యూట్యూబ్ (Youtube)లో కొన్ని ఛానళ్లు.. తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియో (Indecent Videos)లను పోస్ట్ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై సమాధానం చెప్పాలంటూ యూట్యూబ్ ఇండియా (Youtube India)కు సమన్లు జారీ చేసింది. జనవరి 15న ఆయా ఛానళ్ల జాబితాతో ఆ సంస్థ ప్రతినిధి తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
ఈ మేరకు భారత్‌లోని యూట్యూబ్ పబ్లిక్ పాలసీ హెడ్ మీరా ఛాట్‌కు.. కమిషన్ లేఖ రాసింది. అసభ్యకర కంటెంట్‌ను తమ మాధ్యమం నుంచి తొలగించేందుకు ఎలాంటి మెకానిజం వినియోగిస్తున్నారో చెప్పాలని యూట్యూబ్‌ను ఆదేశించింది. సమన్లకు స్పందించకపోతే అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
Here's News
NCPCR Summons YouTube India’s Official Over Indecent Acts Portraying Mother & Sonhttps://t.co/g9nKUbmxWy
— LawBeat (@LawBeatInd) January 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)