ఇటలీ వాయుసేనకు చెందిన రెండు శిక్షణ విమానాలు రోజువారీ విన్యాసాలు చేస్తుండగా ఆకాశంలో ఢీకొన్నాయి.ఇటలీ రాజధాని రోమ్ శివార్లలోని గిల్డోనియా మిలిటరీ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన ఈ ఘటనలో రెండు విమానాల పైలట్లు మృత్యువాతపడ్డారు. వీటిలో ఒకటి పొలంలో కూలిపోగా, మరొకటి పార్క్ చేసి ఉన్న కారుపై పడింది

ఈ ప్రమాదం పట్ల ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన పైలట్ల కుటుంబాలకు, వారి సహచరులకు సంతాపం తెలియజేశారు. యూ-208 విమానం సింగిల్ ఇంజిన్ ట్రైనింగ్ విమానం. దీంట్లో పైలట్ సహా ఐదుగురు ప్రయాణించవచ్చు. ఇది గరిష్ఠంగా గంటకు 285 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Here's Update

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)