అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పేజ్ సిక్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఇద్దరూ ఫ్రాన్స్ లో ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కొన్ని నెలలుగా సాగుతోంది. పేజ్ సిక్స్ కథనం ప్రకారం లారెన్ శాంచెజ్ హార్ట్ షేప్ లో ఉన్న ఉంగరాన్ని ధరించింది. ఇది ఎంగేజ్ మెంట్ రింగేనని కథనంలో ఉంది.

మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అయిన 53 ఏళ్ల సాంచెజ్, 59 ఏళ్ల బెజోస్ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. తన తొలి భార్య మెకెంజీ స్కాట్ తో 2019లో బెజోస్ విడాకులు తీసుకున్నాడు. వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాతే తమ ప్రేమ వ్యవహారాన్ని బెజోస్, లారెన్ బయటపెట్టారు

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)