అమెరికాలోని కాలిఫోర్నియాలో అట‌వి మంట‌ల్ని ఆర్పేందుకు రంగంలోకి దిగిన రెండు హెలికాప్ట‌ర్లు గాలిలోనే ఢీకొన్నాయి. రివ‌ర్‌సైడ్ కౌంటీలోని కేబ‌జాన్ వద్ద‌ ఆదివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న జ‌రిగంది. రెండు హెలికాప్ట‌ర్లు ఢీకొన్న స‌మ‌యంలో.. ఒక‌టి క్షేమంగా కింద‌కు దిగింది. మ‌రో హెలికాప్ట‌ర్ దిగే స‌మ‌యంలో కూలింది. అయితే ఆ హెలికాప్ట‌ర్‌లో ఉన్న ముగ్గురు మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఫైర్ కెప్టెన్‌తో పాటు ఫైర్ ఆఫీస‌ర్‌, పైలెట్ మృతిచెందారు. ఇదో విషాద‌క‌ర ఘ‌ట‌న అని అగ్నిమాప‌క శాఖ తెలిపింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)