చైనాలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటం చైనా సర్కార్‌ను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఆదివారం ఒక్కరోజే 13 వేల కేసులు వెలుగు చూశాయి. ఆదివారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 70 శాతం కేసులు షాంఘైలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. తాజాగా ఈశాన్య చైనాలోని బయో చెంగ్, షాంఘైలోనూ లాక్‌డైన్‌ విధించారు. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర‍్ణయం తీసుకుంది.

సోమవారం ఆ ప్రాంతంలో ఉన్న 26 మిలియన్ల మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక్కడ టెస్టుల కోసం చైనా మిలిటరీని, వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలను షాంఘైకి పంపింది. ఇటీవల ఆర్మీ, నేవీ, జాయింట్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఫోర్స్‌ల నుండి రిక్రూట్ అయిన 2,000 మందికి పైగా వైద్య సిబ్బందిని షాంఘైకి పంపినట్లు సాయుధ దళాల వార్తాపత్రిక నివేదించింది. దీంతో వీరందరూ షాంఘైలో ఉన్న ప్రజలకు టెస్టులు నిర్వహించనున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)