కొలంబియాలోని బుల్‌ఫైట్ స్టేడియం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో నలుగురు మృతిచెంద‌గా, సుమారు 300 మంది గాయ‌ప‌డ్డారు. సెంట్ర‌ల్ కొలంబియాలోని ఎల్ ఎస్పినాల్‌లో ఉన్న స్టేడియంలో బుల్‌ఫైట్ జ‌రిగింది. చెక్క‌ల‌తో నిర్మించిన మూడు అంత‌స్తుల స్టాండ్‌పై భారీ సంఖ్య‌లో ప్రేక్ష‌కులు కూర్చున్నారు. అయితే బుల్ క్రీడ జ‌రుగుతున్న స‌మ‌యంలో స్టాండ్ కూలిపోయింది. శాన్ పెడ్రో ఫెస్టివ‌ల్‌లో భాగంగా బుల్‌ఫైట్‌ను నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు అధ్య‌క్షుడు ఇవాన్ డూక్యూ తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)