కరేబియన్ సముద్రం పనామా-కొలంబియా సరిహద్దులోని గల్ఫ్ ఆఫ్ డేరియన్ వద్ద గత రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.6గా నమోదైంది. రెండు దేశాల్లోనూ ప్రకంపనలు కనిపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. ఆ తర్వాత కొన్ని క్షణాలకే 4.9 తీవ్రతతో అదే ప్రాంతంలో మరో భూకంపం సంభవించింది. రెండు భూకంపాలు భూమికి 10 కిలోమీటర్ల లోతున సంభవించినట్టు యూఎస్‌జీఎస్ తెలిపింది. సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. భూకంపం కారణంగా సంభవించిన నష్టం గురించి ఇంకా తెలియరాలేదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు పనామా సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సినాప్రోక్ తెలిపింది.
News
Earthquake in Caribbean Sea: Strong Quake of Magnitude 6.6 on Richter Scale Strikes Panama-Colombia Border, No Casualty Reported#Earthquake #CaribbeanSea #PanamaColombiaBorder https://t.co/N2NtekWLjO
— LatestLY (@latestly) May 25, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)