Illegal gold mine collapses in Venezuela: సెంట్రల్ వెనిజులాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆంగోస్తురా మునిసిపాలిటీలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోవడంతో 14 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. ఇప్పటి వరకు 23 మంది మృతదేహాలను వెలికి తీశామని, మరో 11 మంది గాయపడినట్లు తెలిసిందని బొలివర్ రాష్ట్ర గవర్నర్ ఏంజెల్ మార్కానో అక్కడి మీడియాకు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించి, రక్షించాలన్నారు. సివిల్ డిఫెన్స్ బృందాలను ఇప్పటికే పంపామని తెలిపారు.
Here's Video
#21Feb | Cumpliendo instrucciones del Vicepdte. Sectorial AJ. @ceballosichaso1 y en coordinación con el Gob. del Edo. Bolívar Ángel Marcano, funcionarios del SNGR junto a Organismos de Seguridad ciudadana y efectivos de la ZODI Bolívar, realizan Operaciones de Salvamento... pic.twitter.com/6FWE5SiE22
— cperezampueda (@cperezampueda) February 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)