అఫ్గన్‌ నేలపై ప్రకృతి విరుచుకుపడింది. బుధవారం వేకువ ఝామున సంభవించిన భూకంపం దాటికి 255 మంది మృతి చెందారు. అయితే ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని సమాచారం. అయితే అఫ్గన్‌ అధికారిక మీడియా మాత్రం ఇంకా మృతుల సంఖ్య 155గానే చెప్తోంది. అఫ్గన్‌ తూర్పు ప్రాంతమైన పాక్‌టికా ప్రావిన్స్‌ కేంద్రంగా.. రిక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది.

నాలుగు జిల్లాల్లో డజన్ల కొద్దీ ఇళ్లు దెబ్బతినగా.. వందల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. రాళ్ల ఇళ్లు కావడంతో తీవ్ర గాయాలతో చాలామంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెలికాప్టర్‌ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వీలైన రీతిలో సాయానికి ముందుకు రావాలని అంతర్జాతీయ సమాజానికి తాలిబన్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు అఫ్గనిస్థాన్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)