ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం పెను ప్రళయం సృష్టించింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం 920 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. దాదాపు 1,500 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ ఆధీనంలోని స్థానిక మీడియా పేర్కొంది. భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే భూకంప తీవ్రత కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్గనిస్తాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిమీ (27 మైళ్ళు) దూరంలో 51 కిమీ లోతులో సంభవించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)