వెనెజువెలా సైక్లింగ్‌ లెజెండ్‌, ఐదుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న డ్యానియెలా లారియల్‌ కిరినోస్‌ అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో అనుమానస్పదరీతిలో మృతి చెందారు. లాస్‌ వెగాస్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. అయితే భోజనం చేస్తుండగా ఆహారం గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.  50 ఏళ్ల డ్యానియోలా 1992- 2012 వరకు ఒలింపిక్‌ క్రీడల్లో వెనెజువెలా తరఫున పాల్గొన్నారు. సైక్లింగ్‌ లెజెండ్‌ డ్యానియెలా మృతి ఆమె అభిమానులతో పాటు క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వెనెజువెలా ఒలింపిక్‌ కమిటీ ఎక్స్‌వేదికగా ఆమెకు నివాళులర్పించింది. ఒలింపిక్ పతక విజేత మను బాకర్ డ్యాన్స్ చూశారా..చెన్నైలోని ఓ స్కూల్‌లో కాలా చష్మా పాటకు స్టెప్పులు..వీడియో

2002లో సెంట్రల్‌ అమెరికన్‌, కరీబియన్‌ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు, 2003లో పాన్‌ అమెరికన్‌ గేమ్స్‌లో రెండు రజత పతకాలు సాధించింది. దేశంలోని పలువురు రాజకీయ నాయకులపై విమర్శలు చేయడంతో దేశ బహిష్కరణకు గురయ్యింది. దీంతో ఆమె అమెరికాలోని లాస్‌ వెగాస్‌లోని ఓ హోటల్‌లో ఫుడ్‌ సర్వర్‌గా పనిచేస్తోంది.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)