గ్రీస్ దేశంలోని దక్షిణగ్రీస్‌ సముద్రజలాల్లో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తాపడటంతో కనీసం 79 మంది జలసమాధి అయ్యారు. డజన్లకొద్దీ జనం జాడ గల్లంతయ్యింది. పెలోపోన్నీస్‌ ప్రాంతం నుంచి తీరానికి 75 కిలోమీటర్లదూరంలో సముద్రంలో మంగళవారం రాత్రివేళ జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 104 మంది కాపాడామని అధికారులు తెలిపారు. విషయం తెల్సుకున్న అధికారులు పెద్ద ఎత్తున గాలింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కాపాడిన వారిలో ఆరోగ్యం విషమంగా ఉన్న వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.తూర్పు లిబియా దేశంలోని తోబ్రక్‌ ప్రాంతం నుంచి ఈ శరణార్థుల పడవ బయల్దేరి ఇటలీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)