గ్రీసు(Greece Migrants) దీవుల్లోని రోడ్స్ ఐలాండ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెట్రోలింగ్ నౌకను తప్పించుకునే ప్రయత్నంలో వలసదారులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా, మరో 18 మందిని పోలీసులు రక్షించారు.మిగిలిన వారి కోసం కోస్టుగార్డు నౌకలు, హెలికాప్టర్లతో గాలింపు చేపడుతున్నారు. టర్కీ కోస్టు తీరానికి సమీపంలో ఉన్న రోడ్స్ దీవుల్లో ఈ ప్రమాదం జరిగింది.గడిచిన వారం రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. వారంక్రితం జరిగి బోటు ప్రమాద ఘటనలో ఏడు మంది మరణించారు. ప్రతి ఏడాది గ్రీసుకు అక్రమంగా ప్రవేశిస్తున్న శరణార్థుల సంఖ్య 60 వేలకు చేరుకున్నది. సిరియా నుంచి అత్యధిక స్థాయిలో వలసలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆఫ్ఘన్, ఈజిప్టు, ఎరిత్రియా, పాలస్తీనా ఉన్నాయి.
Boat Capsizes in Greece:
8 dead, 18 rescued as boat carrying migrants capsizes near Greece https://t.co/WptT9nLnrv
— ABC7 News (WZVN-TV) (@ABC7SWFL) December 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)