గ్రీస్ దేశంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 29 మంది మృతిచెందగా మరో 85 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. గ్రీస్‌లోని టెంపే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్యాసింజర్ రైలు, మరో గూడ్స్ ట్రైన్‌ని ఢీకొట్టింది. రెండు వేగంలో ఉండటంతో ప్రమాదం ధాటికి అనేక బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలకు మంటలు అంటుకున్నాయి. కాగా.. ప్రమాదానికి గురైన ప్యాసింజర్ రైలు.. ఏథెన్స్ నుంచి థెస్సలోనికి అనే ప్రాంతానికి వెళుతున్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 350మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
Here's ANI Tweet
29 killed, 85 injured in Greece as passenger trains collide
Read @ANI Story | https://t.co/iNmYehhPAm#Greece #GreeceTrainAccident #GreeceTrainCrash pic.twitter.com/cwUMaXilwF
— ANI Digital (@ani_digital) March 1, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)