ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వచ్చిన ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనీస్‌లోని చారిత్రక ప్రాంతాలను సందర్శించి మాంటేరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.వెనీస్ నుంచి మాంటేరాకు బస్సు బయలుదేరుతుండగా రాత్రి 7 :30 గంటల ప్రాంతంలో వెనీస్ బ్రిడ్జిపైకి రాగానే అదుపుతప్పిన బస్సు కిందపడిపోయింది.
50 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వైర్లపై పడటంతో బస్సులో నుంచి మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడినవారిని రెస్క్యూ సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చాలామంది క్షతగాత్రులను కాలిపోయిన దశలోనే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదంపై ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Here's ANI Video
#WATCH | At least 21 people died after a city bus carrying tourists to a campground crashed off an overpass near Venice in northern Italy and caught fire, the city's prefect Michele Di Bari said: Reuters pic.twitter.com/rMNjksucn0
— ANI (@ANI) October 3, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)