ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు.సహాయం చేయాలంటూ ఓ విద్యార్థిని వేడకుంటున్న వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు. భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దయచేసి తమను రక్షించాలని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన గరిమా మిశ్రా అనే యువతి వీడియోలో వేడుకున్నారు. ఉక్రెయిన్‌లో ఏం జరుగుతుందో తమకు తెలియడం లేదని వాపోయింది.

సరిహద్దుకు బస్సులో వెళ్లిన మా స్నేహితులను రష్యా సైనికులు అడ్డుకున్నారని మాతో చెప్పారు. విద్యార్థులపై కాల్పులు జరిపి బాలికలను ఎత్తుకెళ్లారు. అబ్బాయిలు ఏమయ్యారో మాకు తెలియదు. మాకు సాయం చేయడానికి భారత సైన్యాన్ని పంపిండి. దయచేసి మాకు సహాయం చెయ్యండి. జై హింద్! జై భారత్! మాకు సహాయం అందేలా చేసేందుకు ఈ వీడియోను దయచేసి షేర్‌ చేయండి’ అంటూ గరిమా మిశ్రా ముకుళిత హస్తాలతో వేడుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)