జపాన్‌లో భూకంపం విలయం సృష్టించింది. అగ్నిప్రమాదం జరిగి ఒకే వీధిలో 200 భవనాలు కాలిపోయాయి. ఇప్పటి వరకు 24 మంది (24 Dead, Several Feared) మరణించినట్లు స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి.నీగట, టొయామ, ఫుకూయ్‌, గిఫూ నగరాల్లో క్షతగాత్రులను గుర్తించారు. 45 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అటు భూకంపం (Japan earthquake) కారణంగా నిన్న జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తాజాగా తగ్గించారు.ఒక్క సోమవారమే తీవ్రమైన 155 ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. రిక్టర్‌ స్కేల్‌పై వీటి తీవ్రత 3-7.6 మధ్యలో నమోదైంది.

భూకంపం ధాటికి వేల ఇళ్లు, భవనాలు నేలకూలాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. జపాన్‌లో సునామీ రావడంతో అలలు మీటరు ఎత్తు వరకు ఎగసిపడ్డాయని, దీంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న సముద్ర తీర ప్రాంతం అయిన ఇషికావాలో మరణాల సంఖ్య భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోసారి భూ ప్రకంపనలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)