జపాన్‌ దేశాన్ని గంటల వ్యవధిలో 155 కంటే ఎక్కువ సార్లు రిక్టరు స్కేలుపై 4 కంటే ఎక్కువ తీవ్రతతో భూప్రకంపనలు వణికించిన సంగతి విదితమే. నోటో ద్వీప‌క‌ల్పంలో 7.6 తీవ్రత‌తో వచ్చిన భూకంపం వ‌ల్ల పెను న‌ష్టమే వాటిల్లింది. ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 100కి పెరిగింది. సుమారుగా 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనలో గల్లంతైన 211 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఆచూకీ లేకుండా పోయిన వారి జాడ కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో బాధితులు ఇళ్ల శిథిలాల కిందే చిక్కుకుపోయి ఉన్నారు. ప్రస్తుతం వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)