వరుస భూకంపాలు జపాన్ దేశాన్ని కుదిపేశాయి. ఒక్క రోజులోనే ఏకంగా 155 సార్లు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై అత్యధికంగా 7.6 గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసం కాగా చాలా ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటి వరకు 24 మంది చనిపోయారని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. కూలిన నిర్మాణాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉంటారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆందోళన వ్యక్తం చేశారు.సముద్రంలో అలలు భారీగా ఎగిసిపడడంతో తీర ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. భూకంప తీవ్రతకు ఓ మెట్రో స్టేషన్ అల్లల్లాడుతున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. దీంతోపాటు భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)