ఇండోనేషియాలోని సెరాసన్ దీవిలో కుండపోత వర్షాలు కురిశాయి. వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు 11 మంది ప్రాణాలు తీసింది. మరో 50 మంది గల్లంతయ్యారు. అయితే, విపత్తు జరిగిన ప్రాంతంతో ఇతర ప్రాంతాలకు సమాచార సంబంధాలు తెగిపోయాయి. దీంతో రక్షణ, సహాయక చర్యలు చేపట్టడానికి తీవ్ర ఆలస్యమవుతోంది. సముద్ర మార్గం గుండా అక్కడి వెళ్లడానికి ఐదు గంటల సమయం పడుతుందని, అందుకే హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ టీమ్స్‌ను విపత్తు ప్రదేశానికి తరలిస్తున్నామని ఇండోనేషియా అధికారులు తెలిపారు. బోర్నియోలోని బంజర్ జిల్లాలో వరదల ధాటికి 17 వేల ఇండ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు.
Here's Update News
A landslide caused by torrential rain killed at least 11 people and left dozens of others missing on an island in Indonesia’s remote Natuna regency on Monday, disaster officials said. https://t.co/w8T2ka5R2S
— AP Climate (@AP_Climate) March 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)