అమెరికాలో ఖలిస్తానీ సిక్కు వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ మందిర్ వసాన సంస్థ గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాశారు. ప్రధాని మోదీపై విద్వేష పూరిత రాతలు కూడా రాసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను హిందూ అమెరికా ఫౌండేషన్ ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది.

నెవార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, సివిల్ రైట్స్ డివిజన్‌‌కు ఫిర్యాదు అందినట్టు కూడా వెల్లడించింది. ఈ ఘటనను ద్వేషపూరిత నేరంగా పరిగణించి దర్యాప్తు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. గతంలోనూ కెనడాలో హిందూ వ్యతిరేక ఘటనలు వెలుగు చూశాయి. కెనడాలోని సర్రీ నగరంలో ఇటీవల ఓ దేవాలయం గోడలపై ఆగంతుకులు విద్వేషపూరిత రాతలు రాశారు. ఖలిస్థానీ వేర్పాటు వాది నిజ్జర్ హత్యకు సంబంధించిన నిరసనల ఫొటోలను గుడి తలుపులపై అతికించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)