ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో (Mozambique) ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు. ప్రమాద సమయంలో అందులో 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి సామర్థ్యానికి మించి ప్రయాణించడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో చెప్పారు.
కలరా వ్యాప్తిచెందుతుందంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళుతుండగా ఈ పడవ మునిగిందని జైమ్ నెటో తెలిపారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన మొజాంబిక్‌లో గత అక్టోబర్ నుంచి 15 వేల కలరా కేసులు నమోదవగా, 32 మంది చనిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. టేకాఫ్ సందర్భంగా ఊడిపోయిన బోయింగ్ విమానం ఇంజెన్ కవర్.. వీడియో ఇదిగో!
Here's News
More than 90 people died when an overcrowded makeshift ferry sank off the north coast of Mozambique, local authorities said on Sunday.
Read more at: https://t.co/8lVayQMPHE
— Daily Tribune (@tribunephl) April 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)