రష్యా అన్నంత పని చేసింది. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నది. రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలపై పెద్దఎత్తున బాంబులతో దాడులు చేస్తున్నది. కీవ్ ఎయిర్‌పోర్ట్ వద్ద, ఖార్కివ్‌లలో పెద్దఎత్తున పేలుళ్లు సంభవించాయని బీఎన్‌ఓ న్యూస్ తెలిపింది. అదేవిధంగా డెనెట్స్క్ ప్రావిన్స్‌లోని యరియుపోల్‌పై శక్తివంతమైన బాంబులతో దాడి చేసింది.
ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన కొద్ది సేపట్లోనే ఆ దేశంలోని ప్రధాన నగరాలపై సైన్యం బాంబుల వర్షం కురిపించింది. కాగా, రష్యా చర్యలతో ఉక్రెయిన్ ప్రభుత్వం అప్రమత్తమయింది. అప్పటికే దేశంలో ఎమర్జెనీ విధించిన సర్కార్ ఎయిర్ స్పేస్‌ను మూసివేసింది. తమను తాము రక్షించుకుని విజయం సాధిస్తామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ప్రశాంతంగా ఉన్న తమ దేశంలో పుతిన్ అలజడి సృష్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
WATCH: Large explosions seen near Ukraine's Kharkiv after Putin declares war pic.twitter.com/pOnLsClXBs
— BNO News (@BNONews) February 24, 2022
WATCH: Missile hits airport in Ivano-Frankivsk, Ukraine pic.twitter.com/EnskxXhpnq
— BNO News (@BNONews) February 24, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)