రష్యా తన యుద్ధం ఆపాలంటూ రష్యా టీవీ లైవ్‌ షోలో నిరసన తెలిపిన మహిళా జర్నలిస్ట్‌కు దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాస్కోలోని ఛానల్‌1లో పనిచేస్తున్న మెరీనా ఓవ్స్యానికోవా యుద్ధం ఆపాలని ప్లకార్డుతో రష్యాకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మెరీనా అనంతరం మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్‌ టైమ్స్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది.

ఇందులో సదరు ఉద్యోగి ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి తను చేసిన ప్రయత్నాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. తనను 14 గంటలపాటు పోలీసులు విచారించినట్లు తెలిపింది. తన కుటుంబాన్ని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ‌అంతేగాక ఘటన తర్వాత పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు న్యాయ సహాయం కూడా అందలేదని వాపోయింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)