రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోన్న సంగతి విదితమే. మారిపోల్ న‌గ‌రంలో జ‌రిగిన భీక‌ర పోరులో ర‌ష్యా జ‌న‌ర‌ల్ హ‌త‌మైన‌ట్లు ఉక్రెయిన్ ఆర్మీ చెప్పింది. ఈ యుద్ధంలో ర‌ష్యా నాలుగ‌వ జ‌న‌ర‌ల్‌ను కోల్పోయిన‌ట్లు అజోవ్ ఆర్మీ తెలిపింది. మారిపోల్ దాడి స‌మ‌యంలో మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఓలేగ్ మిత్యేవ్ హ‌త‌మైన‌ట్లు ఉక్రెయిన్ హోంశాఖ వెల్ల‌డించింది. జ‌న‌ర‌ల్ ఓలేగ్‌కు చెందిన ఫోటోను టెలిగ్రామ్‌లో షేర్ చేశారు. జాతిని ఉద్దేశించి చేసిన ప్ర‌సంగంలో జ‌న‌ర‌ల్ మ‌ర‌ణం గురించి జెలెన్‌స్కీ తెలిపారు. 46 ఏళ్ల మిత్యేవ్‌.. 150వ రైఫిల్ డివిజ‌న్‌కు క‌మాండ‌ర్‌గా ఉన్నారు. సిరియా యుద్ధంలోనూ ఆయ‌న పోరాడారు. అయితే జ‌న‌ర‌ల్ మిత్యేవ్ మృతి ప‌ట్ల ర‌ష్యా ఇంకా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)