సిరియా దేశాన్ని భూకంపం వణికించిన సంగతి విదితమే. సోమవారం వచ్చిన భూకంపం వల్ల సిరియా జైలు ధ్వంసమైంది.ఇదే అదనుగా జైలులో శిక్ష అనుభవిస్తున్న 20 మంది జిహాదీలు తప్పించుకున్నారు.తుర్కియే బోర్డర్ సమీపంలో ఉన్న రాజో జైలు నుంచి ఆ జిహాదీలు పరారీ అయ్యారు. దాంట్లో సుమారు రెండు వేల మంది ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఖైదీల్లో దాదాపు 1300 మంది ఐఎస్ ఫైటర్ల ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వీరిలో ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన 20 మంది మిలిటెంట్లు పరారీ అయినట్లు జైలు అధికారి వెల్లడించారు. కుర్దిష్ నేతృత్వంలోని ఫైటర్లు కూడా జైలులో ఉంటున్నట్లు అధికారులు వెల్లడించారు. 7.8 తీవ్రతతో భూకంపం రావడం వల్ల జైలులో ఉన్న గోడలు, డోర్లు పగిలిపోయాయి. దీంతో ఖైదీలు తప్పించుకుంటున్నారు.
Here's Update
At least 20 inmates belonging to Islamic State escape Syrian prison after the earthquake #ISIS #earthquake https://t.co/dwAqArP3X9
— BreezyScroll (@BreezyScroll) February 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)