అమెరికా కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. సోమవారం రెండు వేరు చోట్ల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాన్ మటేవో కౌంటీలోని హాల్ఫ్ మూన్‌ బే ప్రాంతంలో ఈ ఘటనలు జరిగాయి.

సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ పుట్టగొడుగుల ఫామ్‌లోని ఇంట్లోకి ప్రవేశించి దుండగుడు కాల్పులు జరిపాడు. మొత్తం నలుగురిని హతమార్చాడు. ఆ తర్వాత కాసేపటికి ఓ ట్రక్కు కంపెనీ షెడ్డు వద్ద మరో ముగ్గుర్ని కాల్చి చంపాడు. ఇంకొకరికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రం 5 గంటల్లోగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీకి తరలించి విచారిస్తున్నారు.

Here's Update News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)