Newdelhi, Sep 23: ఆసియా (Asia) ఖండంలో అతిపెద్ద క్రీడా సంబురానికి శనివారం తెరలేవనుంది. చైనాలోని (China) హాంగ్జూ వేదికగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న 19వ ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది. ఈ క్రీడల్లో మన దేశం నుంచి 655 మంది అథ్లెట్లు.. 39 క్రీడా విభాగాల్లో పతకాల కోసం పోటీ పడనున్నారు. 2018లో జకార్తా (ఇండోనేషియా) వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలు (16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలు) సాధించి పతకాలు పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈసారి ఫుల్ జోష్‌లో ఉన్న మనవాళ్లు సెంచరీ కొట్టి ఆసియాలో మేటి క్రీడా దేశంగా నిలువాలని తహతహలాడుతున్నారు.
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీగా వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. వీడియోతో
Asian Games 2023: With its largest contingent, India aim for biggest medal tally in Hangzhou https://t.co/KMK7safBK5
— Scroll.in (@scroll_in) September 23, 2023
షెడ్యూల్ ప్రకారం 2022లోనే..
షెడ్యూల్ ప్రకారం 2022లోనే జరగాల్సిన ఈ క్రీడలను కొవిడ్-19 కారణంగా వాయిదా వేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన భారత అథ్లెట్లు భారీ ఆశలతో ఆసియా క్రీడల బరిలోకి దిగుతుంటే.. ఇప్పటికే పలు క్రీడాంశాల్లో పోటీలు ప్రారంభమైపోయాయి. అక్టోబర్ 8 వరకు సాగనున్న ఈ టోర్నీలో హాంగ్జూతో పాటు ఐదు నగరాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం జరుగనున్న టోర్నీ ఆరంభ వేడుకల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పాల్గొననుండగా.. హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ కెప్టెన్), లవ్లీనా బొర్గోహై (బాక్సింగ్) భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు.