Srikanth Kidambi - Wikipedia

మాడ్రిడ్, డిసెంబర్ 20: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్‌ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 15వ సీడ్‌ శ్రీకాంత్‌ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్‌ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్‌ కెరీర్‌లో తొలి టైటిల్‌ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్‌ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఓవరాల్‌గా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరిన మూడో భారత ప్లేయర్‌ శ్రీకాంత్. ఇప్పటివరకూ సైనా నెహ్వాల్, పి.వి. సింధు ఈ ఘనత సాధించారు. సైనా నెహ్వాల్ 2015లో, సింధు 2017,2018, 2019లో వరుసగా ఫైనల్ చేరింది. సైనా నెహ్వాల్‌ రజత పతకం గెలుచుకోగా.. సింధు రెండు సార్లు రజతం, ఓ సారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.