New Delhi, June 23: భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియాపై మరోసారి సస్పెన్షన్ వేటు (Bajrang Punia Suspended) పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (NADA) సస్పెండ్ చేసింది. గతంలోనే పునియాపై నాడా వేటు వేయగా.. ముందస్తు నోటీసులు జారీ చేయని కారణంగా దాన్ని క్రమశిక్షణ సంఘం ఎత్తివేసింది. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చిన నాడా.. తాజాగా మళ్లీ వేటు వేసింది. పునియాపై గతంలో నాడా (NADA) విధించిన సస్పెన్షన్‌ను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ క్రమశిక్షణ సంఘం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ కోసం మార్చి 10న సోనెపట్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో పాల్గొన్న భజరంగ్ పునియా సెమీ ఫెనల్స్‌లో ఔటయ్యాడు. అనంతరం డోపింగ్ పరీక్షలకు శాంపిల్స్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. పునియా చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ ఏప్రిల్ 23న అతన్ని సస్పెండ్ చేసింది.
Andolanjeevi wrestler #BajrangPunia has been suspended by the National Anti-Doping Agency for an anti-doping rule violation.
These people are a shame to the sports world , they know well that with fair trials they won’t even make it to the nationals and thus they have been… pic.twitter.com/zdg1f6phSA
— Amitabh Chaudhary (@MithilaWaala) June 23, 2024
ఈ సస్పెన్షన్‌పై అప్పుడే స్పందించిన పునియా.. తాను శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించలేదని తెలిపారు. శాంపిల్ తీసుకునేందుకు అధికారులు గడువు ముగిసిన కిట్‌ను ఉపయోగించినందున వివరణ అడిగానని చెప్పారు. ఇప్పటివరకు కూడా నాడా నుంచి ఎలాంటి నోటీసు అందలేదని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ క్రమశిక్షణ సంఘం (ADAP)తో పేర్కొన్నారు. పునియా వివరణ నేపథ్యంలో అతనిపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల ఏడీఏపీ ఆదేశాలు జారీ చేసింది.