Shama Mohamed and Rohit Sharma (Photo Credits: X/@shamohd/facebook)

కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ శరీరాకృతి పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె రోహిత్ శర్మను "ఒక లావైన క్రీడాకారుడుగా ఉన్నాడు" అని వ్యాఖ్యానిస్తూ, అతని నాయకత్వాన్ని "ఆకట్టుకోలేని కెప్టెన్ అని అభివర్ణించారు. సోషల్ మీడియాలో ఆమె ఇలా పేర్కొన్నారు: "ఆయన బరువు తగ్గాలి! అలాగే, భారత్‌కు ఇప్పటివరకు ఉన్న అత్యంత ఆకట్టుకోలేిన కెప్టెన్ కూడా ఇతనే! అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు అభిమానుల నుంచి మిశ్రమ స్పందనను రాబట్టాయి. కొందరు రోహిత్ శర్మను మద్దతుగా నిలబడగా, మరికొందరు అతని ఫిట్‌నెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలోనూ రోహిత్ ఫిట్‌నెస్‌పై విమర్శలు వచ్చాయి, కానీ అతను భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్ ప్రమాణాలు, కెప్టెన్సీ విలువలపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.

అక్షర్ పటేల్‌ అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో, అవుటయ్యానా అంటూ బిత్తర చూపులు చూసిన న్యూజీలాండ్ స్టార్ రచిన రవీంద్ర

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్‌ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు.

Congress Spokesperson Shama Mohamed Questions Rohit Sharma’s Fitness

వరుణ్‌ చక్రవర్తి తన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.రచిన రవీంద్రను ఆరు పరుగులకే హార్దిక్‌ పాండ్యా బౌలింగ్లో అక్సర్‌ పటేల్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టి పెవిలియన్‌ బాట పట్టించాడు. 49 పరుగుల వద్ద వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో విల్‌ యంగ్‌ క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు.