Joginder Sharma (Photo-ANI)

భారత క్రికెటర్ జోగిందర్ శర్మ శుక్రవారం, ఫిబ్రవరి 03, 2023న అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల ఆల్ రౌండర్.. 2004లో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. అతను 4 ODI, 4 T20I మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.

జోగిందర్ శర్మ ప్రధానంగా ICC T20 ప్రపంచ కప్ 2007లో తన చివరి ఓవర్‌ వేయడం ద్వారా వార్తల్లోకెక్కాడు. ఈ ఓవర్ ద్వారా పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. హర్యానాలో జన్మించిన జోగిందర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు.

అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన మరో భారత క్రికెటర్, అన్ని క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్న ప్రకటించిన 2007 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ

జోగిందర్ శర్మ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. టీమిండియా తరుపున 4 వన్డేలు ఆడిన జోగిందర్ శర్మ ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. అయినప్పటికీ 2007లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన జోగిందర్ శర్మ, చివరి ఓవర్‌లో 15 పరుగులు ఇచ్చి మ్యాచ్ గెలిపించాడు. ఆసీస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు కావాల్సి ఉండగా 15 పరుగులే జోగిందర్ శర్మ ఇవ్వడంతో భారత జట్టు 6 పరుగుల తేడాతో విజయం అందుకుని ఫైనల్ చేరింది.

స్లిప్‌లో స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్న సూర్యకుమార్ యాదవ్, పైకి జంప్ చేసి క‌ళ్లు చెదిరే రీతిలో అందుకున్న వీడియో ఇదే..

ఇక ఫైనల్లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా జోగిందర్ అద్భుతమే చేశాడు. ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్‌లో పాకిస్తాన్ విజయానికి 13 పరుగులు కావాలి. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. ఆఖరి ఓవర్ ను నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ..జోగిందర్ శర్మకు అప్పగించాడు. బంతిని తీసుకున్న జోగిందర్ శర్మ.. మొదటి బంతి వైడ్‌ వేశాడు. ఆ తర్వాత బంతికి పరుగులేమీ రాలేదు. ఇక మూడో బంతి ఫుల్ టాస్‌ వేయడంతో పాక్ బ్యాటర్ మిస్బా వుల్ హక్, స్ట్రైయిక్ సిక్సర్ కొట్టాడు.దీంతో పాకిస్తాన్ విజయానికి ఆఖరి నాలుగు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి.నాలుగో బంతి వేశాడు జోగిందర్. అయితే ఆ బంతిని స్కూప్ షాట్ ఆడేందుకు మిస్బా వుల్ హక్ ప్రయత్నించాడు

బంతి గాల్లోకి లేచింది. దీంతో ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రీశాంత్ దాన్ని అందుకున్నాడు. దీంతో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించి..మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఈ విజయం తర్వాత జోగిందర్ శర్మకు రూ.21 లక్షల రికార్డుతో పాటు డిప్యూటీ సూపరిండెంట్‌ ఆఫ్ పోలీసుగా ఉద్యోగాన్ని హర్యానా ప్రభుత్వం ఆఫర్ చేసింది.

2007 అక్టోబర్‌లోనే హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన జోగిందర్ శర్మ, 2016-17 సీజన్ వరకూ రంజీ మ్యాచుల్లో ఆడాడు. 2012 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడారు. సీఎస్‌కేకి రెండు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. అయితే 2013 వేలంలో అమ్ముడుపోని జోగిందర్ శర్మ, ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆడేందుకు ఇంట్రస్ట్ చూపలేదు.

2007లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జోగిందర్ శర్మ, 2023లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా నేడు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. జోగిందర్ శర్మ రిటైర్మెంట్‌తో 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ మాత్రమే మిగిలారు. వీరిలో దినేశ్ కార్తీక్, 2022 టీ20 వరల్డ్ కప్‌ ఆడగా రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు.