New Zealand, OCT 18: మహిళల టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో సీజన్‌లో మరో ఉత్కంఠ పోరు. ‘నువ్వా నేనా’ అన్నట్టు సాగిన రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో జయభేరి మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్వల్ప ఛేదనలో టాపార్డర్ విఫలమైన వేళ జట్టును గెలపించేందుకు ఆల్‌రౌండర్ డియాండ్ర డాటిన్ (33) విశ్వ ప్రయత్నం చేసింది. కానీ, ఈడెన్ కార్సన్(3/29), అమేలియా కేర్(2/14)లు తిప్పేయడంతో కరీబియన్ హిట్టర్లు తలొంచక తప్పలేదు. అక్టోబర్ 20, ఆదివారం జరుగబోయే ఫైనల్లో దక్షిణాఫ్రికాను కివీస్ ఢీ కొట్టనుంది. రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో వెస్టిండీస్ తడబడింది. ఇంగ్లండ్‌పై చెలరేగిన ఓపెనర్ క్వియానా జోసెఫ్ (12)ను కార్సన్ బౌల్డ్ చేసి న్యూజిలాండ్‌కు బ్రేకిచ్చింది. ఆ తర్వాత హేలీ మాథ్యూస్(15), షెమైనే క్యాంప్‌బెల్లె(3)లు ఆచితూచి ఆడడంతో.. పవర్ ప్లేలో విండీస్ స్కోర్.. 25 మాత్రమే. అనంతరం బంతి అందుకున్న కార్సన్.. స్టఫానీ టేలర్(13)ను బౌల్డ్ చేసి మూడో వికెట్ ఖాతాలో వేసుకుంది. 10 ఓవర్లు అయినా స్కోర్ 50 దాటకపోవడంతో ఒత్తిడి పెరిగిపోయింది.
New Zealand Women Enter Final of ICC Women's T20 World Cup 2024
NEW ZEALAND ARE IN THE FINAL 🔥
They pull off a stunning win over West Indies to make their first Women's #T20WorldCup final since 2010 👏#WhateverItTakes | #WIvNZ pic.twitter.com/3x454aLbby
— T20 World Cup (@T20WorldCup) October 18, 2024
ఈ క్రమంలోనే డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడిన మాథ్యూస్(15) అమేలియా చేతికి చిక్కింది. దాంతో, కరీబియన్ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. ఇక జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్న డియాండ్ర డాటిన్(33) రెండు లైఫ్స్ లభించాయి. అయినా కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయగా 4.5 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ రాలేదు.మైర్ వేసిన 15వ ఓవర్లో ఫ్లెచర్ (17) బౌండరీ బాదగా.. ఆ తర్వాతి తహుహుకు డాటిన్ సిక్సర్‌తో స్వాగతం పలికింది. అప్పటికీ సాధించాల్సిన రన్ రేటు 10 పైనే ఉంది.
ఇక లాభం లేదనుకున్న డాటిన్ చివరి రెండు బంతుల్ని సైతం స్టాండ్స్‌లోకి పంపింది. అంతే.. అప్పటిదాకా బిక్కమొహాలతో కనిపించిన విండీస్ డగౌట్‌లో ఆమె జోష్ నింపింది. కానీ, అమేలియా ఆమెను ఔట్ చేసి కివీస్‌కు పెద్ద బ్రేకిచ్చింది. అయితే.. జైదా జేమ్స్(14), అఫీ ఫ్లెచర్(13)లు డెత్ ఓవర్లలో ధాటిగా ఆడారు. బేట్స్ వేసిన 20వ ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా జైదా తొలి బంతిని బౌండరీకి పంపింది. కానీ, మూడో బంతికి బౌల్డ్ అయింది. అంతే.. విండీస్ ఓటమి ఖాయమైంది. 8 పరుగుల తేడాతో గెలుపొందిన కివీస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.