BCCI Domestic తన ఎక్స్ (ట్విట్టర్)లో ఓ సంచలన వీడియో షేర్ చేసింది. ఈ వీడియోకి 𝟔 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 𝐀𝐥𝐞𝐫𝐭 అంటూ క్యాప్సన్ జోడించింది. వీడియో ప్రకారం..అండర్-23 జాతీయ టోర్నీ అయిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో వంశీకృష్ణ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. కడపలో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ బౌలింగులో వంశీకృష్ణ ఆరు సిక్సర్లు బాదాడంటూ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన బీసీసీఐ.. అలెర్ట్ అంటూ రాసుకొచ్చింది. . ఈ మ్యాచ్‌లో వంశీకృష్ణ 64 బంతుల్లోనే 110 పరుగులు చేసినట్టు పేర్కొంది. భారత్ వికెట్ కీపర్ మెరుపు వేగంతో రనౌట్ చేసిన వీడియో ఇదిగో, ఇంగ్లండ్ కుప్పకూలడానికి కారణం ఇదే, 4 పరుగులతో పెవిలియన్ చేరిన బెన్ డకెట్
కాగా 1985లో బాంబేకు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి రంజీల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు క్రియేట్ చేశాడు.బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతులను స్టాండ్స్‌లోకి తరలించి ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు.ఆ తర్వాత 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ బౌలింగులో యువరాజ్ సింగ్ ఆరు బంతులను స్టాండ్స్‌లోకి పంపి అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Here's Video
𝟔 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 𝐀𝐥𝐞𝐫𝐭! 🚨
Vamshhi Krrishna of Andhra hit 6 sixes in an over off Railways spinner Damandeep Singh on his way to a blistering 64-ball 110 in the Col C K Nayudu Trophy in Kadapa.
Relive 📽️ those monstrous hits 🔽@IDFCFIRSTBank | #CKNayudu pic.twitter.com/MTlQWqUuKP
— BCCI Domestic (@BCCIdomestic) February 21, 2024
తర్వాత 1968లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడిన విండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్ గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాల్కమ్ నాష్ బౌలింగులో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా సౌతాఫ్రికా బ్యాటర్ హర్షలే గిబ్స్ పేరు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది.