Team India's Schedule For International Home Season 2023: స్వదేశంలో టీమిండియా 2023-24లో ఆడనున్న మ్యాచ్‌ల వివరాలను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వెల్లడించింది. ఏడాది కాలంలో భారత సీనియర్ పురుషుల జట్టు సొంతగడ్డపై 5 టెస్టులు, 3 ODIలు, 8 T20Iలతో మొత్తం 16 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌కు ముందు మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌కు ఆస్ట్రేలియాతో భారత్ ఆతిథ్యమివ్వడంతో హోమ్ సీజన్ ప్రారంభమవుతుంది. మొహాలీ, ఇండోర్, రాజ్‌కోట్‌లలో వన్డే సిరీస్‌లు జరగనున్నాయి. 50 ఓవర్ల ప్రపంచ కప్ తర్వాత, భారతదేశం ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌ను ఆడుతుంది, నవంబర్ 23న వైజాగ్‌లో ప్రారంభమై డిసెంబర్ 3న హైదరాబాద్‌లో ముగుస్తుంది.
ఇక కొత్త ఏడాదిని అఫ్గనిస్తాన్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌తో ఆరంభించనుందని భారత క్రికెట్ బోర్డు వెల్లడించింది. మొహాలీ, ఇండోర్, బెంగళూరులలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతుందని పేర్కొంది. అదే విధంగా భారత్‌లో అఫ్గనిస్తాన్ తమ మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌ను బెంగళూరులో ఆడబోతోందని తెలిపింది. ఆ తర్వాత జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుందని వెల్లడించింది. హైదరాబాద్, వైజాగ్, రాజ్‌కోట్, రాంచి, ధర్మశాల ఇందుకు వేదికలుగా ఉంటాయని బీసీసీఐ వెల్లడించింది.