Team India. Photo Credits: (@BCCI/Twitter)

New Delhi, June 20: పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీలో (T-20 Wolrd Cup) అద‌ర‌గొడుతున్న‌ టీమిండియా(Team India) త్వ‌ర‌లోనే సొంత‌గ‌డ్డ‌పై వ‌రుసపెట్టి మ్యాచ్‌లు ఆడ‌నుంది. భార‌త జ‌ట్టు స్వ‌దేశంలో 2024-25 సీజ‌న్‌లో భాగంగా ఆడ‌నున్న అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ (Schedule) వ‌చ్చేసింది. టీమిండియా ఏ జ‌ట్టుతో ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుంది? అనే వివ‌రాల‌ను గురువారం భార‌త క్రికెట్ బోర్డు (BCCI) వెల్ల‌డించింది. సెప్టెంబ‌ర్ 19 వ తేదీతో సీజ‌న్ ఆరంభం కానుంద‌ని బీసీసీఐ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

 

సీజ‌న్ తొలి ఫైట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో (Bangladesh)  రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) సార‌థ్యంలోని టీమిండియా టెస్టు సిరీస్ ఆడ‌నుంది. అనంత‌రం ఇరుజ‌ట్ల మ‌ధ్య మూడు టీ20ల సిరీస్ జ‌రుగ‌నుంది. అక్టోబ‌ర్ 12న జ‌రిగే భార‌త్, బంగ్లా ఆఖ‌రి పొట్టి పోరుకు హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం (Uppal Stadium) వేదిక కానుంది. ఆ త‌ర్వాత న్యూజిలాండ్ (Newzealand) జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానుంది.

 

అక్టోబ‌ర్ 16 నుంచి నవంబ‌ర్ 15 వ‌ర‌కూ జ‌రిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కివీస్ త‌ల‌ప‌డ‌నుంది. ఇవి ముగియ‌గానే.. ఇంగ్లండ్(England) జ‌ట్టు టీ20, వ‌న్డే సిరీస్ కోసం భార‌త్‌లో అడుగుపెట్ట‌నుంది. 2025 జ‌న‌వరి 22 నుంచి ఫిబ్ర‌వ‌రి 12 వ‌ర‌కూ జ‌రిగే ఈ రెండు ఫార్మాట్ల సిరీస్‌లో టీమిండియాకు ఇంగ్లీష్ జ‌ట్టు స‌వాల్ విస‌ర‌నుంది.