New Delhi, AUG 03: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. టీమిండియా (Team India) స్వదేశంలో ఆడబోయే హోం సిరీస్ కోసం షెడ్యూల్ రిలీజ్ చేసింది. సౌతాఫ్రికా(South Africa), ఆస్ట్రేలియాలతో(Australia) టీమిండియా సిరీస్ లు ఉండనున్నాయి. దీంతో సెప్టెంబర్, అక్టోబర్ లో టీమిండియా ఆటగాళ్లు ఫుల్ బిజీ కానున్నారు. ఈ మేరకు సిరీస్ షెడ్యూల్ (schedule)ను బీసీసీఐ (BCCI)రిలీజ్ చేసింది. ఆస్ట్రేలియాతో మూడు టీ-20లు ఆడనుంది టీమిండియా. సెప్టెంబర్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 20న మొహాలీలో ఫస్ట్ టీ-20 నిర్వహించనుండగా, సెప్టెంబర్ 23న నాగ్‌పూర్ లో రెండో టీ-20 మ్యాచ్, సెప్టెంబర్ 25న హైదరాబాద్ లో మూడో టీ-20 మ్యాచ్ జరుగనుంది. ఆస్ట్రేలియాతో సిరీస్ పూర్తయిన తర్వాత టీమిండియా వెంటనే సౌతాఫ్రికాతో టీ-20, వన్డే సిరీస్ ఆడనుంది.
Check out the #INDvSA home series schedule. 👌#TeamIndia | @BCCI | @OfficialCSA pic.twitter.com/jo8zC4hjDq
— BCCI (@BCCI) August 3, 2022
ఇక సౌతాఫ్రికాతో మూడు టీ-20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కు సంబంధించి కూడా బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసింది. సౌతాఫ్రికాతో సెప్టెంబర్ 28 న తిరువనంతపురంలో తొలి టీ-20, అక్టోబర్ 2న గౌహతిలో రెండో టీ-20 మ్యాచ్, ఇక ఇండోర్ లో అక్టోబర్ 4న మూడో టీ-20 మ్యాచ్ జరుగుతుంది. అటు అక్టోబర్ 6న ఫస్ట్ వన్డే మ్యాచ్ లక్నోలో నిర్వహించనున్నారు.
ఇక అక్టోబర్ 9న రెండో వన్డే మ్యాచ్ ను రాంచీలో, మూడో వన్డే మ్యాచ్ ను అక్టోబర్ 11న ఢిల్లీలో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌ల కోసం త్వరలోనే జట్టును కూడా ప్రకటించనున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ ల్లో టీమిండియా ఆడనున్న మ్యాచ్‌లతో క్రికెట్ పండుగ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సిరీస్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.