Birmingham, August 3: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్ క్రీడల్లో భారత మహిళల లాన్ బౌల్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్లో మూడు సార్లు ఛాంపియన్ గా నిలిచినా సౌతాఫ్రికా జట్టుని 17-10 తేడాతో ఓడించి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. లాన్ బౌల్స్ క్రీడలో పతకాన్ని సాధించడం భారత్ కు ఇదే తొలిసారి.
విరుచుకుపడ్డ సూర్యకుమార్.. చివర్లో మెరిసిన పంత్.. విండీస్ పై భారత్ జయభేరి
భారత జట్టులో రూపా దేవి ట్రికీ, నయన్‌మోనీ సైకియా, లవ్లీ చౌబీ, పింకీ సింగ్ అద్భుతంగా రాణించారు. కాగా, లాన్ బౌల్స్‌లో స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్య పదికి (4 స్వర్ణాలు, 3 రజతాలు, మూడు కాంస్యాలు) చేరింది. లాన్ బౌల్స్ అనేది ఓ అవుట్ డోర్ క్రీడ.