ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేటి నుంచి ప్రారంభమయ్యే టెస్టు (India vs England) ముగిసిన తర్వాత ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్ లకు గాను బీసీసీఐ గురువారం జట్లను ప్రకటించింది. అయితే ఈ టీ20 సిరీస్ కు జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ ఫ్యాన్స్ బీసీసీఐ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ తో జులై 7 నుంచి ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ లో ( T20I and ODI series against England) భాగంగా తొలి మ్యాచ్ కు ఐర్లాండ్ సిరీస్ లో ఆడిన జట్టునే సెలక్టర్లు కొనసాగించారు.
వీరికి అదనంగా రోహిత్ శర్మ ఒక్కడే జతకలిశాడు. సీనియర్లు కోహ్లి, రిషభ్ పంత్, బుమ్రా, శ్రేయస్ అయ్యర్ లకు ఈ మ్యాచ్ లో చోటు దక్కలేదు. ఐర్లాండ్ తో రెండో టీ20లో అదరగొట్టిన సంజూ శాంసన్ కు తొలి మ్యాచ్ లో మాత్రమే చోటు కల్పించారు. తర్వాత రెండు మ్యాచులకు అతడిని పక్కనబెట్టారు. అతడితో పాటు రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్ కూడా తర్వాత రెండు మ్యాచులలో చోటు దక్కలేదు. వీరి స్థానంలో సీనియర్లు జట్టుతో కలుస్తారు.
ఇక టీ20లలో చోటు దక్కించుకోలేకపోతున్న శిఖర్ ధావన్ మాత్రం వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. మహ్మద్ షమీ, సిరాజ్ కూడా వన్డేలకు ఎంపికయ్యారు. ఇక దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి జట్టుకు ఎంపికవుతున్నా ఆడటానికి అవకాశం రాని అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి వన్డేలలో చోటు దక్కించుకున్నాడు. టీ20 సిరీస్ లో సభ్యుడిగా ఉన్నా ఉమ్రాన్ మాలిక్ కు వన్డేలలో మొండిచేయి చూపారు సెలక్టర్లు.
తొలి టీ20కి భారత జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
రెండు, మూడో టీ20లకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.