Asia Cup 2023 Schedule: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ వేదికగా జరిగే క్రికెట్ మ్యాచుల్లో ఆడబోమని బిసిసిఐ ప్రకటన, భారత్, పాక్ మ్యాచులు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో నిర్వహించాలని నిర్ణయం
India vs Pakistan T20 Asia Cup 2022 (Photo-Twitter)

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌ వేదికగా జరిగే క్రికెట్ మ్యాచ్‌లో  ఆడబోమని బిసిసిఐ స్పష్టం చేసింది. ఆసియా కప్‌లో ప్రస్తుతం ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, నేపాల్ వంటి దేశాలు ఆడుతున్నాయి. రోహిత్ శర్మ నేతృత్వంలో పాకిస్థాన్‌లో ప్రయాణించబోమని ఐపిఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ తెలిపారు. ఐసిసి ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆధ్వర్యంలో బిసిసిఐ సెక్రటరీ జైషా, ఐపిఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్, పిసిబి ప్రతినిధి జాకా అష్రఫ్ పాల్గొని ఆసియా కప్‌కు సంబంధించి షెడ్యూల్‌ను ఖరారు చేశారు. నాలుగు లీగ్ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో, 11 మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగనున్నాయి. పాకిస్థాన్-భారత్, ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఉంటే దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాను కానీ టీమిండియా కానీ పాకిస్తాన్ వెళ్లటం లేదని ధుమాల్ నొక్కి చెప్పారు. 2010లో శ్రీలంకలోని దంబుల్లా వేదికగా పాకిస్తాన్-భారత్ మ్యాచ్ జరిగినట్టు ఇప్పుడు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఫ్ఘానిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్, శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్, శ్రీలంక వర్సెస్ అప్ఘానిస్థాన్, పాకిస్తాన్ వర్సెస్ నేపాల్‌తో మ్యాచ్‌లు పాకిస్తాన్‌ వేదికంగా జరుగనున్నట్టు సమాచారం.