England Biggest Defeats By Runs (PIC@ X)

Mumbai, OCT 21: ముంబైలోని  వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa) చేతిలో చిత్తుగా  ఓడిన ఇంగ్లండ్‌  (England) పలు చెత్తరికార్డులను మూటగట్టుకుంది. పరుగుల పరంగా  ఇంగ్లండ్‌కు ఇదే తొలి భారీ పరాజయం.  అంతేగాక  వన్డే ప్రపంచకప్‌లలో   ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ హోదా ఉన్న జట్లలో కూడా (Biggest Defeats By Runs)  అత్యధిక పరుగుల తేడాతో ఓడిన జట్లలో ఇంగ్లాండ్‌ రెండో స్థానంలో ఉంది. వివరాల్లోకెళ్తే.. ముంబైలో సౌతాఫ్రికా నిర్దేశించిన 400 పరుగుల ఛేదనలో ఇంగ్లీష్‌ జట్టు  170 పరుగులకే చాప చుట్టేసింది. తద్వారా డిఫెండింగ్‌ ఛాంపియన్లు  229 పరుగుల తేడాతో  ఓడింది.

 

వన్డే ప్రపంచకప్‌లో  ఫుల్‌ మెంబర్స్‌ నేషన్స్‌గా ఉండి  పరుగులపరంగా అత్యంత  భారీ తేడాతో  ఓడిన జట్లలో ఇంగ్లండ్‌ రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌ కంటే ముందు..  సౌతాఫ్రికా వెస్టిండీస్‌ను 257 పరుగుల తేడాతో (2015లో) ఓడించింది.  2007లో ఆస్ట్రేలియా..  న్యూజిలాండ్‌ను 215 పరుగుల తేడాతో  ఓడించగా  2011లో  శ్రీలంక.. బంగ్లాదేశ్‌ను 219 పరుగులతో మట్టికరిపించింది. ఇక ఇంగ్లండ్‌కు పరుగులపరంగా ఇదే భారీ ఓటమి.  గతంలో ఇంగ్లీష్‌ జట్టు.. 2022లో ఆస్ట్రేలియా చేతిలో  221 పరుగుల తేడాతో  ఓడటమే  ఇప్పటివరకూ ఆ జట్టుకు  భారీ పరాజయం.  2018లో కూడా శ్రీలంక.. 219 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.